Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 8:22 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ పోలీస్, ఎన్ సీ సీ క్యాడేట్ ల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సి.ఐ ప్రసాద్  తన సిబ్బందితో  ఎన్ సి సి 20 క్యాడేట్స్ లతో ట్రాఫిక్ నియమాల గురించి  ప్రజలకు అవగాహన కల్పించారు. గురువారం నగరంలోని బైపాస్ లోని డిఎస్ చౌరస్తాలో అవగాహన కల్పించడం జరిగినది. ఈ సంధర్బంగా ఎసీపీ, సిఐలు మాట్లాడుతూ…ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలెను,18 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న మైనర్ డ్రైవింగ్ చేయరాదు అన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయరాదని,ఆటో డ్రైవర్స్ కచ్చితంగా యూనిఫామ్ ధరించ వలెను అని తెలిపారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించవలెను, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, మద్యం తాగి వాహనములు నడుపరాదు అని అన్నారు.

Awareness campaign under the joint leadership of Traffic Police and NCC Cadets