ఆయుర్వేద, యోగపై విద్యార్థులకు అవగాహన శిబిరం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాశాల, నిజామాబాద్ ఆధ్వర్యంలో బోర్గం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత ఆయుర్వేద, యోగ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు. శిబిరంలో వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దినచర్య, రుతుచర్య, సీజనల్ వ్యాధుల నివారణకు పాటించాల్సిన ఆరోగ్య సూచనలు, అలాగే యోగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఆయుర్వేదం, యోగ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు....