నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సారంగాపూర్ జిల్లా జైల్లో టిబి అవగాహనా, హెచ్ఐవి, హేపాటిటీస్ బి పరీక్షలు నిర్వహించామని జిల్లా జైల్ సూరిండెంట్ ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు టిబి లక్షణాలు, అది సోకకుండా జాగ్రత్తల గురించి ఖైదీలకు వివరించడం జరిగింది. 430 ఖైదీలకు టిబి స్క్రీనింగ్ నిర్వహించామని అందులో 27 ఖైదీల తెమడా నమూనాలను సేకరించామని రేపటిలోగా రిజల్ట్స్ వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి,జైలర్ రాజశేఖర్ రెడ్డి, జైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్, జిల్లా టిబి సమన్వయ కర్త రవిగౌడ్, డి. పి. యం. సుధాకర్,సాతి ఎన్జీఓ వినోద్, మహేష్, జైల్ ఫార్మసిస్ట్ రాంచందర్, టిబి సూపెర్వైసోర్ స్రవంతి, మరియు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
