సీజనల్ వ్యాధులపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ,శ్వాస సంబంధిత వ్యాధులపై నిజామాబాద్ వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అపర్ణ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మమతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2-3...