హరిత సౌభాగ్యం పై అవగాహన
మోర్తాడ్, బతుకమ్మ : 2022-23వ సంవత్సరం నుండి నేటి వరకు వన మహోత్సవం లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో నాటబడిన బ్రతికున్న మొక్కల కు కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవీ అన్నారు. కార్బన్ క్రెడిట్ (హరిత సౌభాగ్యం) కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండలాల్లోని దోన్ పాల్ గ్రామంలో ఆమె అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. జిల్లాలో గత మూడు సంవత్సరాల నాటిన మొక్కలకు కార్బన్ క్రెడిట్ తెలంగాణ సౌభాగ్యం...