Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 3:12 pm Posted by : ramakrishna

హరిత సౌభాగ్యం పై అవగాహన

మోర్తాడ్, బతుకమ్మ : 2022-23వ సంవత్సరం నుండి నేటి వరకు వన మహోత్సవం లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో నాటబడిన బ్రతికున్న మొక్కల కు కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవీ అన్నారు. కార్బన్ క్రెడిట్ (హరిత సౌభాగ్యం) కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండలాల్లోని దోన్ పాల్ గ్రామంలో ఆమె అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. జిల్లాలో గత మూడు సంవత్సరాల నాటిన మొక్కలకు కార్బన్ క్రెడిట్ తెలంగాణ సౌభాగ్యం రూపంలో అన్ని రకాల ప్లాంటేషన్ లకు వ్యక్తిగత ప్రభుత్వ స్థలాలలో నాట బడిన మొక్కలకు కార్బన్ క్రెడిట్ రూపంలో వాటి యొక్క చెట్టుకొమ్మలు విస్తీర్ణం ను బట్టి 30 సంవత్సరాల వరకు బతుకే ఉన్న మొక్కలకు ఆర్థిక సహాయం రూ.1000 నుంచి 12,000 వరకు వచ్చే అవకాశం ఉందని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గ, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు రమేష్, అంగన్వాడి టీచర్లు సుజాత, సుమలత, ఆశా వర్కర్లు జమున తదితరులు పాల్గొన్నారు.