Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 6:10 pm Posted by : ramakrishna

మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పాత కలెక్టర్ మైదానం నుండి న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా పై పాఠశాల, కళాశాలల విద్యార్థులకు, యువతకు సందేశాన్ని, సూచనలను అందజేశారు.

 

Awareness about drug abuse

 

అనంతరం మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై రాష్ట్ర కార్యాలయము, తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన గోడ ప్రతులను ఆవిష్కరించి, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి డి.సౌందర్య, జిల్లా ప్రొబేషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు, ఇండియన్ సైకియార్టిక్ సొసైటీ తెలంగాణా బ్రాంచ్ జనరల్ సెక్రెటరీ, ప్రొఫెసర్ డా. విశాల్ ఆకుల, డాక్టర్ కేశవులు, డాక్టర్ రవితేజ, సీడిపిఓ ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ గాలి విజయ లక్ష్మి, రూరల్ సిడిపిఓ ఫర్హత్, ఆర్మూర్ సిడిపిఓ భార్హవి, బోధన్ సిడిపిఓ నందిని, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది నదీమ్ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ సిబ్బంది, జిల్లా మైనారిటీ రెసిడేన్షియల్ పాటశాల కళాశాల, జీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్థులు, ఎస్ఎస్ఆర్ జూనియర్, డిగ్రీ కాలేజీ, అల్ ఫోర్డ్స్ కాలేజీ, కాకతీయ కళాశాల, ఇతర ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు సూపర్వైజర్లు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర స్థాయి నుండి నియమించబడిన కమ్యునిటీ కో-ఆర్డినేటర్ షేఖ్ వసీం పాల్గొన్నారు.

 

Awareness about drug abuse