బ్లడ్ స్టెమ్ సెల్ దానంపై అవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పందారి శక్తి ఫౌండేషన్, దాత్రి ఎన్.జి.ఓ ఫౌండేషన్ సహకారంతో ఆదివారం బ్లడ్ స్టెమ్ సెల్ దానంపై అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ – 2లో గల వివేకానంద హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్త క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలతో పోరాటం చేస్తున్న వారికి మీరు ఆశదాయకులవచ్చునని, ప్రతి 5 నిమిషాలకు ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారని,...