అథ్లెటిక్ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 2న నిర్వహించిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా గెలుపొందిన  అథ్లెట్స్  కు గురువారం బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం నాగారంలోని రాజారామ్ స్టేడియంలో  నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్  తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి వై ఎస్ ఓ  పవన్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ డివైఎస్ఓ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత  మొట్టమొదటి కార్యక్రమం  ఆటలకు అమ్మ వంటి అథ్లెటిక్స్ కు రావడం చాలా  సంతోషంగా  ఉందన్నారు....