Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 5:29 pm Posted by : ramakrishna

అథ్లెటిక్ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 2న నిర్వహించిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా గెలుపొందిన  అథ్లెట్స్  కు గురువారం బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం నాగారంలోని రాజారామ్ స్టేడియంలో  నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్  తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి వై ఎస్ ఓ  పవన్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ డివైఎస్ఓ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత  మొట్టమొదటి కార్యక్రమం  ఆటలకు అమ్మ వంటి అథ్లెటిక్స్ కు రావడం చాలా  సంతోషంగా  ఉందన్నారు. గెలుపొందిన పాఠశాలకు ఛాంపియన్షిప్ ట్రోఫీలను అందజేశారు. బాలుల విభాగంలో  మొదటి ఓవరాల్ ఛాంపియన్షిప్ మహాత్మ జ్యోతిబాపూలే మోర్తాడ్ జట్టు కైవసం చేసుకోగా, రెండో  ఛాంపియన్షిప్  క్షత్రియ పాఠశాల పెర్కిట్  అందుకుంది, మూడవ ఛాంపియన్షిప్ సిద్ధార్థ పాఠశాల నందిపేట్  సాధించింది .  అదేవిధంగా  బాలికల విభాగంలో మొదటి ఛాంపియన్షి  కేజీబీవీ సిరికొండ సాధించగా,   రెండవ ఛాంపియన్షిప్ విజయ హై స్కూల్  నిజామాబాద్ అందుకుంది, మూడవ చాంపియన్షిప్ విద్యా హై స్కూల్ డిచ్పల్లి  కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ట్రస్మా చీఫ్ అడ్వైజర్ మామిడాల మోహన్, టీచర్స్ యూనియన్ బీసీ నాయకులు మురళీకృష్ణ,  అసోసియేషన్ సభ్యులు మధు ,  వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.