ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రకటించిన జిల్లా స్థాయి 11 మంది ఉపాధ్యాయులకు, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను సన్మానించారు.  నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో సోమవారం గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి నియోజకవర్గస్థాయిలో 3000 విద్యార్థులు ఉన్నతమైన విద్యలభ్యసించడానికి...