Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 7:41 pm Posted by : ramakrishna

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రకటించిన జిల్లా స్థాయి 11 మంది ఉపాధ్యాయులకు, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను సన్మానించారు.  నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో సోమవారం గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి నియోజకవర్గస్థాయిలో 3000 విద్యార్థులు ఉన్నతమైన విద్యలభ్యసించడానికి మోడల్ కాన్సెప్ట్ స్కూల్స్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతమున్న పాఠశాలను మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ బడుగు బలహీనవర్గా విద్యార్థులకు ఉన్నతమైన ఉత్తమమైన బోధనలు చేయడానికి తగిన సౌకర్యాలు పాఠశాలలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పటికే ప్రతి మండలంలో విద్యాశాఖ అధికారిని నియమించడం జరిగిందని, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల మంది నూతన ఉపాధ్యాయులను నియమించామని అన్నారు. ఇంతేగాక ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నగర మేయర్ నీతూ కిరణ్, డీఈఓ అశోక్, గడుగు గంగాధర్, మునిపల్లి సాయిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.