బతుకమ్మ , బాన్సువాడ :
బాన్సువాడ పట్టణం బండా గల్లి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె సమీరా డిఎస్సి 2024 లో జిల్లా స్థాయిలో 3 వ రాంక్ సాధించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సత్కరించారు. వారి స్వగృహంలో గురువారం సమీరాను శాలువా తో సన్మానించి అభినందించారు.జిల్లా స్థాయి లో రాంక్ సాధించడం గొప్ప విషయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు అంజి రెడ్డి , మాజీ ఎఎంసి చైర్మన్ నార్ల రవీందర్ గుప్త , అక్బర్ అలీ , మట్ట సాయిలు, సయ్యద్ ఇలియాస్ అలీ , ఇబ్రహీం పేట్ మాజీ వార్డ్ సభ్యులు మొహమ్మద్ సమద్ తదితరులు పాల్గొన్నారు…