డాక్టరేట్ సాధించిన ఉపాధ్యాయునికి సన్మానం
నిజామాబాద్, బతుకమ్మ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు విభాగంలో డాక్టరేట్ పొందిన డాక్టర్ సుంకరి గంగాధర్ ను ముబారక్ నగర్‌లోని తెలుగు పాఠశాల ఉపాధ్యాయ బృందం బుధవారం సత్కారం చేశారు. ప్రధాన ఉపాద్యాయుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు పరిశోధనా రంగంలో డాక్టరేట్ సాధించడం తమ స్కూల్ కే గర్వకారణమని తెలుపుతూ డాక్టర్ సుంకరి గంగాధర్ యొక్క పరిశోధన ఫలితాలు విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్మృతి కవిత్వం సమగ్ర పరిశీలనపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన గంగాధర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు,...