Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 8:24 pm Posted by : ramakrishna

డాక్టరేట్ సాధించిన ఉపాధ్యాయునికి సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు విభాగంలో డాక్టరేట్ పొందిన డాక్టర్ సుంకరి గంగాధర్ ను ముబారక్ నగర్‌లోని తెలుగు పాఠశాల ఉపాధ్యాయ బృందం బుధవారం సత్కారం చేశారు. ప్రధాన ఉపాద్యాయుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు పరిశోధనా రంగంలో డాక్టరేట్ సాధించడం తమ స్కూల్ కే గర్వకారణమని తెలుపుతూ డాక్టర్ సుంకరి గంగాధర్ యొక్క పరిశోధన ఫలితాలు విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్మృతి కవిత్వం సమగ్ర పరిశీలనపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన గంగాధర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు, డాక్టర్ కాసర్ల చింతల శ్రీనివాస్ గుప్త, రాంప్రసాద్, నరేంద్రమూర్తి, దేవన్న, భూమన్న, కైలాస్, అరుంధతి వినోద, విమల, లలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.