స్పెషల్ ఉపాధ్యాయునికి సన్మానం

బతుకమ్మ పిట్లం : ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ లో స్పెషల్ టీచర్ గా ఉద్యోగం పొందిన గంగాధర్  మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ భవిత సెంటర్లో విధులు నిర్వహిస్తున్న గంగాధర్ కు స్పెషల్ ఉపాధ్యాయులుగా పోస్ట్ రావడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమోద్ కుమార్, సీఆర్పీ హైమద్ పాషా, ఎంఆర్సీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశోక్, అంబయ్య, ఐఈఆర్ఠీ కమల్ కిషోర్, రఫీక్ పాల్గొన్నారు.