నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధక విద్యార్థి కందుకూరి వెంకటేశ్వర్లు కు డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టర్ వాసం చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రిపరేషన్”స్టడీస్ ఆన్ మీథేన్ డికంపోజిషన్ ఓవర్ నికెల్ బేస్డ్ హెటిరోజినెస్ కాటలిస్ట్స్ ఫర్ మాలిక్యులర్ హైడ్రోజన్ ప్రొడక్షన్” అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. గురువారం నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.జ్యోతి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథం పై, హైడ్రోజన్ ఉత్పత్తిపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధక విద్యార్థి ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వడంతో ఎక్సటర్నల్ ఎగ్జామినర్ పరిశోధన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్ ఇంధనాన్ని తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేయడం, ప్రస్తుతం వాడుతున్న ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన ఉపయోగాలను తన సిద్ధాంత గ్రంథంలో తెలియజేసినందుకు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు.