Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 2:58 pm Posted by : ramakrishna

అందుబాటులో అవసరమైన ఎరువులు

  • జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

 

బతుకమ్మ, బోధన్: ఎడపల్లి జిల్లా రైతాంగానికి అవసరమైన యూరియా ఎరువులు తగిన మేరకు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఎడపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో ఎరువుల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “జిల్లా మొత్తానికి 11 మెట్రిక్ టన్నుల యూరియాను రైతుల కోసం అందుబాటులో ఉంచాం. ఎక్కడైనా యూరియాను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాం” అని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ పంటలు జిల్లాలో చాలా అనుకూలమై ఉండడంతో అధిక లాభాలు పొందే అవకాశముందని చెప్పారు. ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ దత్తాత్రే, ఎంపీడీవో శంకర్ నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మల్కా రెడ్డి పాల్గొన్నారు.