నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎస్ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలకు ఆటానామస్ హోదా లభించిందని కళాశాల చైర్మన్ మారయ్య గౌడ్ తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి కళాశాలకు ఈప్రత్యేక హోదా ఉంటుందన్నారు. కళాశాల స్థిరమైన విద్యా ప్రదర్శన, అధిక న్యాక్ రేటింగ్, పరిపాలన అభివృద్ధిలో ట్రాక్ రికార్డు ఆధారంగా ఈ గుర్తింపు లభించిందన్నారు. ఇందుకోసం కృషి చేసిన యూజీసీ, తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు, కళాశాల యజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
