Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 1:18 pm Posted by : ramakrishna

7న ఆటోల బంద్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఆటో, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్లకు రూ.15వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 7వ తేదీన రాష్ర్టవ్యాప్తంగా ఆటోల బంద్ పాటించనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ డ్రైవర్స్ యూనియన్  (ఐఎఫ్ టీయూ) జిల్లా కార్యదర్శి, ఆటో యూనియన్ నాయకుడు ఎం శివకుమార్ తెలిపారు.  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో ఉపాధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు యూనియన్ నాయకులమనే పేరుతో పైరవీలు చేస్తూ ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాటించనున్న బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సాయికుమార్, ప్రసాద్, షబ్బీర్, ఇర్ఫాన్, సలీం, గంగా ప్రసాద్, మహమ్మద్, రాజు తదితరులు పాల్గొన్నారు.