Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 9:21 pm Posted by : ramakrishna

ఆటో బోల్తా

 

. . . ఇద్దరికి గాయాలు

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట మండలం కొయ్య గుండు తండా సమీపంలో గురువారం ఉదయం ఆటో బోల్తా పడగా ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కొయ్య గుండు తండా కు చెందిన సునీత వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడానికి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి దాటుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. కామారెడ్డి నుండి లింగంపేటకు వస్తున్న ఆటో డ్రైవర్ సునీతను గమనించి తప్పించే ప్రయత్నంలో ఆటో అతుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సతీష్ కు తీవ్ర గాయాలు కాగా సునీతకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో బోల్తా పడడంతో ఆటోలో తరలిస్తున్న పెరుగు డబ్బాలు రోడ్డుపాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను 108 అంబులెన్స్ వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది కృష్ణ, ప్రకాష్ గౌడ్ బాధితులకు ప్రథమ చికిత్సలు అందించారు.

 

Auto-rickshaw overturns