మల్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఆంజన్న ర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఆటో బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో ఆటోలోని నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆటోలోని ప్రయాణికులను గోదావరిఖనివాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.