Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 5:19 pm Posted by : ramakrishna

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

రుద్రూర్, బతుకమ్మ  : మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ,15వేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో యూనియన్ జేఏసీ తలపెట్టిన ఆటోలు బంద్ జయప్రదం చేయాలని  సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆటో కార్మికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఓలా, ఉబర్, రాపిడో ద్విచక్ర వాహనాలలో రద్దు చేయాలని కోరారు. ఆటో, రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఖలీం, ఫక్రు, అంజయ్య, అజ్జు తదితరులు పాల్గొన్నారు.