Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 1:28 pm Posted by : ramakrishna

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ బలవన్మరణం

ఇల్లందు, బతుకమ్మ :    ఆర్థిక ఇబ్బందులతో  ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇల్లందులోని ఆర్& ఆర్ కాలనీకి చెందిన పాసి దుర్గాప్రసాద్ (45)  జగదాంబ సెంటర్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఇటీవల తన కూతురు వివాహం కోసం అప్పు చేశాడు. ఉచిత బస్సు వల్ల సంపాదన లేక అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసందర్భంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన  హామీని అమలు చేయాలని ఆటో సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.