కామారెడ్డి జిల్లా గర్గుల్ లో ఘటన
కామారెడ్డి, బతుకమ్మ : ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గర్గుల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గుండికాడి నర్సింలు ఆదివారం ఉదయం సంఘ భవనం వద్ద ఆత్మహత్య చేసుకొని ఉన్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. నర్సింలుకు సొంతంగా ఇల్లు కూడా లేదు. కేవలం ఆటో పైనే జీవనం సాగించేవాడు. గిరాకీలు రాక ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవునిపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని శవాన్ని పంచనామ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.