ఆటో, బైక్ ఢీ.. ఒకరికి గాయాలు
రామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి శివారులో శుక్రవారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.