‘అధికార’ అండదండలు

బతుకమ్మ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంజీర పరీవాహక ప్రాంతం నుంచి రాత్రీపగలు తేడాలేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ డంప్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక మంజీరా పరీవాహక గ్రామానికి చెందిన వ్యక్తి చక్రం తిప్పుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలను చూసుకుని ఆ వ్యక్తి కనుసైగతో రెవెన్యూ, పోలీసు అధికారులను శాసిస్తున్నాడని, వారిని మామూళ్ల మత్తులో ముంచెత్తుతున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు ప్రశ్నిస్తే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనని...