Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 9:23 pm Posted by : ramakrishna

అధికారులు అక్రమార్కులపై చర్యలు చేపట్టాలి

  • బాధితులకు అండగా బీజేపీ నిలబడుతుంది
  • బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బెల్డారి నవీన్

 

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని ఆక్లూరు గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను అదే గ్రామానికి చెందిన బీయర్ యస్ నాయకుడు అక్రమంగా కబ్జా చేసుకొని లబ్ధిదారులపై దాడి, దౌర్జన్యానికి పాల్పడుతున్నరని, అట్టి సదర్ వ్యక్తి పై  అధికారులు చర్యలు చేపట్టి పరిష్కారం చూపాలని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ డిమాండ్ చేశారు.బీజెపి కానిస్టేన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం భాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి మీకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1994లో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ప్లాట్లను అన్యాయంగా ఎవరో కబ్జా చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా భాధితులకు న్యాయం చేయలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీయర్ యస్ పార్టీ నాయకుడు అక్రమ కబ్జా చేస్తే మందాలించాల్సింది పోయి అక్రమార్కులకు సపోర్ట్ చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఈ అక్రమ కబ్జా ద్వారా బీయర్ యస్ వాల్ల నిజస్వరూపం బైటపడిందని అన్నారు.సత్వరమే సమస్య పరిష్కరించకపోతే ఎం. పీ ధర్మపురి అరవింద్ దృష్టికి తీసుకెళ్లి భాధితుల తరపున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.. ఈ కార్యక్రమం లో మండల బీజేపీ జనరల్ సెక్రటరీ భాను, ఉపాధ్యక్షులు రాజ గంగారాం, సెక్రటరీ జిల్లా ప్రవీణ్, అక్లూరి ప్రవీణ్,శేషి దర్మేందర్, భాధితులు తదితరులు పాల్గొన్నారు.