Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:36 pm Posted by : ramakrishna

అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారు సామాజిక సేవలను కొనసాగించాలి

 

. . . ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేయడం గొప్ప విషయమని, అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారు ముందు ముందు మరిన్ని సామాజిక సేవలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలో అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారి సహకారంతో, పద్మపాని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎన్.జీ.ఓ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం కోసం ల్యాప్ టాప్ లను ఉచితంగా అందించారు. అనంతరం డిచ్ పల్లి, మానవతా సదన్ లో ఉంటూ చదువుతున్న 70 మంది బాలబాలికలకు స్కూల్ బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ విద్యలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. మానవతా సదన్ లోని విద్యార్థులు హస్త నైపుణ్యంతో తయారుచేసిన ఆర్ట్ ఫ్రేమ్ ని కలెక్టర్ కి అందించడం జరిగింది. అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ భవిష్యత్తులో వారికి ఏ అవసరాలు ఉన్నా తీరుస్తామని, ఇక్కడి విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలను తమ కంపెనీ ద్వారా ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్, పద్మపాణీ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రతినిధి విద్యా శ్రీనివాసరావు, అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ జనరల్ మేనేజర్ సామ్యూల్ రాజ్, అసిస్టెంట్ మేనేజర్ కాశీనాథ్, సెంట్రల్ ఇన్ చార్జ్ రమేష్, జోనల్ మార్కెటింగ్ మేనేజర్ సాయికుమార్, క్లస్టర్ మేనేజర్ ప్రవీణ్, నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ మహేష్, నందిపేట బ్రాంచ్ మేనేజర్ నగేష్, ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ పాల్గొన్నారు.

 

Augment Gold for All should continue social services