Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 2:03 pm Posted by : ramakrishna

దేవాలయాల పరిరక్షణ సమితి ఆడియో రిలీజ్

నిజామాబాద్, బతుకమ్మ: హిందూ దేవాలయాల పరిరక్షణపై దేవాలయాల పరిరక్షణ  సమితి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో సీడీని లింగేశ్వర ఆశ్రమం(మల్లారం) పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహరాజ్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  దేవాలయాల పరిరక్షణ సమితి నాయకుడు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన అతి పురాతనమైన ఆలయాలను, ఆలయాలకు సంబంధించిన విలువైన భూములను కొందరు కబ్జా చేస్తున్నారని అన్నారు. మన ఆలయాలను ఆలయాలకు సంబంధించిన భూములను మనమే రక్షించుకుందాం, కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో దేవాలయాలు ధూపదీప నైవేద్యాలతో విలసిల్లాలని కోరారు. హిందూ ఆలయాలు, ఆలయాల భూముల పరిరక్షణ కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున కాగడాలతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున హిందూ యువకులు ఒక్కొక్కరు ఒక్కో శివాజీ లాగా కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనగా, కృష్ణ మహారాజ్ వారికి మార్గదర్శనం చేశారు.

Audio Release of Temple Conservation Society