Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 12:54 pm Posted by : ramakrishna

హమాల్ వాడి సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నం

 

… పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని హమాల్వాడి  ప్రాంతంలో గల సాయిబాబా మందిరంలో దొంగలు చోరీకి యత్నించారు.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు దొంగలు ఆలయంలో చొరబడి చోరికి ప్రయత్నించారు. ఆలయం ప్రధాన గేట్ వద్ధ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా అలికిడి కావడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశారు.

Attempted theft at Hamalvadi Saibaba Temple

పోలీస్ అధికారులు అప్రమత్తం చేయడంలో వెంటనే త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయంలో చోరీకి యత్నిస్తున్న  ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు పరిశీలించారు. ఆలయాలలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు త్రీ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.

Attempted theft at Hamalvadi Saibaba Temple