. . . పోలీసులకు చిక్కిన నేరస్తుడు
లింగంపేట, బతుకమ్మ :
లింగంపేట్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం తెల్లవారు జామున చోరీకి యత్నించిన వ్యక్తి పోలీసులకు చిక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై దీపక్ కుమార్ కథనం ప్రకారం గాంధారి మండల కేంద్రానికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం ఒంటర్ పల్లి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు.

లింగంపల్లి గ్రామ శివారులో గల వాటర్ ప్లాంట్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు వెల్లడించారు. శశికుమార్ సోమవారం తెల్లవారు జామున ఒంటిగంట సమయంలో లింగంపేటలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు ఆటోలో వచ్చాడు. ఆటోను ఇంటి పక్కన సందులో ఉంచి ఏటీఎంలోకి చొర బడ్డాడు. ఏటీఎంలోని నగదును దోచుకునేందుకు ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేస్తుండగా వచ్చిన శబ్దంతో ఇంటి యజమాని పంబల్ల శ్రీనివాస్ నిద్రలో నుంచి లేచి స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఎస్ఐ తన సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకొని చోరీకి యత్నించిన శశి కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించిన తీరుపై విచారణ చేపట్టారు. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రల నమూనా లను సేకరించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
