ఇందిరమ్మ ఇల్లు కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నం

సూర్యపేట జిల్లాలో ఘటన సూర్యపేట, బతుకమ్మ :  ఇందిరమ్మ ఇల్లు కోసం ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేశాడు.  వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని స్థానిక కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య రూ.50 వేలు లంచం అడిగాడని, అతనికి రూ.20 వేలు ఫోన్ పే చేసినా తన పేరు రాకుండా చేశారని కనకయ్య అనే  వ్యక్తి  ఆవేదన వ్యక్తం చేశాడు.  దీంతో కనకయ్య వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నాం చేశారు. పోలీసులు...