Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 1:41 pm Posted by : ramakrishna

మొబైల్ షాపులో దొంగతనానికి యత్నం

 

. . . ఒకరిని పట్టుకున్న స్థానికులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని బోదన్ రోడ్డులో మొబైల్ షాప్ లో చోరి యత్నం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఇద్ధరు గుర్తు తెలియని యువకులు మెహపీల్ హోటల్ పక్కన గల మొబైల్ షాపు తాళాలను తెరిచి యత్నించారు. ఓకరు లోనికి ప్రవేశించగా, మరోకరు బయట కాపల ఉండగా స్థానికులు గమనించారు. కాపల ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పరారీ అయ్యారు.  లోపల ఉన్న యువకుడిని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు.