ఆసుపత్రిలో ఉద్యోగిపై అత్యాచారయత్నం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ   :   నగరంలోని ఖలీల్ వాడిలోని  పూజ ఆసుపత్రిలో తోటి ఉద్యోగిపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విధుల్లో ఉన్న యువతిపై ఆసుపత్రి ఉద్యోగి రోహిత్ సామూహిక అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన యువతి అతని నుంచి తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలిని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచాణ చేపడుతున్నారు