…చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరి అరెస్టు
…. మరోకరు పరారీ
…. చైనా మాంజ స్వాదినం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరి అరెస్టు చేయగా మరో కరు పరారి అయ్యారని వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు నగర టూ టౌన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు. ఎస్ హెచ్ ఓ తెలిపిన వివరాల ప్రకారం….. చైనా మాంజా విక్రయిస్తున్నారు అనే అందిన సమాచారం మేరకు పోలీసులు రెండు టీములుగా విడిపోయి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ వెనుక సుల్తాన్ షోరూం వద్ద కైట్ షాప్ దగ్గర ఒక వ్యక్తి సయ్యద్ అస్లాం 18 మాంజా చుట్టలు తన బైక్ టీ ఎస్ 16 ఈ పి 8342. లో పెట్టుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అతని యజమాని ఫహీం అన్సారీ. ఇద్దరి పై హత్య యత్నం కేసు నమోదు చేసారు. ఫహీం అన్సారీ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మనుష్యలకు, పక్షులకు ప్రాణాంతకమైన నిషేధించబడ్డ చైనా మంజ ఎవరూ ఉపయోగించుకూడదు అనీ, చైనా మాంజా విక్రేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయితలను పట్టుకోవడంలో హెడ్ కాన్స్టేబుల్ రాములు, కానిస్టేబుల్ సాయి కిరణ్ , నవీన్, భరద్వాజ పాల్గొన్నారు.