బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం
నిజామాబాద్, బతుకమ్మ : నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ప్రధాని మోదీ ఒత్తిడి మేరకే ఈడీ కేసులు నమోదు చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకోవడానికి డిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి బీజేపీ కార్యాలయం ముట్టడికి...