మినీ వాటర్ ట్యాంక్ స్థలాన్ని అక్రమ భూ కబ్జాకు యత్నం

కారోబార్ ఏది అనుకుంటే అదే బరాబర్ కబ్జాకు గురికాకుండా చూడాలి ఎస్సీ కులస్తులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులు   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని (గౌరారం)లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో తమ గ్రామంలోని మినీ వాటర్ ట్యాంక్ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వివరాలలోకి వెళ్తే లింగాపూర్ గ్రామానికి చెందిన కొండా రవి గ్రామంలో కారోబర్ పనిచేస్తుంటారని తెలిపారు. కారోబర్ రవి, అతని కుటుంబానికి చెందిన రాములు, నరసయ్య, శ్రీధర్లు కలిసి...