- కారోబార్ ఏది అనుకుంటే అదే బరాబర్
- కబ్జాకు గురికాకుండా చూడాలి
- ఎస్సీ కులస్తులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని (గౌరారం)లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో తమ గ్రామంలోని మినీ వాటర్ ట్యాంక్ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వివరాలలోకి వెళ్తే లింగాపూర్ గ్రామానికి చెందిన కొండా రవి గ్రామంలో కారోబర్ పనిచేస్తుంటారని తెలిపారు. కారోబర్ రవి, అతని కుటుంబానికి చెందిన రాములు, నరసయ్య, శ్రీధర్లు కలిసి మినీ వాటర్ ట్యాంక్ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు వినతిపత్రంలో ర్కొన్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఎక్కువ కావడంతో మినీ వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగిందని గ్రామస్తులు,ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ సంబంధించిన పంపు మోటారు లైన్ చెడిపోయిందని గ్రామపంచాయతీ కార్యదర్శి విన్నవించినప్పటికీ స్పందించలేదని వారు ఆరోపించారు. అదే గ్రామంలో కొండ రవి కారోబర్గా విధులు నిర్వహించడంతో తమ గ్రామస్తుల పైన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.నీటి సమస్య ఉన్నప్పుడు నీటిని నింపుకొని వాడుకుంటామని తెలిపారు.గత కొన్ని రోజులుగా మినీ వాటర్ ట్యాంకు బోరు మోటర్ పైపు చెడిపోవడంతో గ్రామస్తులు,ఎస్సీ కాలనీవాసులు, తలవంతుగా డబ్బులు పోగు చేసి అక్కడే ఉన్న మినీ వాటర్ ట్యాంక్ కు కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.దీంతో అదే గ్రామానికి చెందిన కొండ రవి, అనే వ్యక్తి మినీ వాటర్ ట్యాంకును ఎవరు నింపవద్దు దీనిని ఎవరు వాడుకోవద్దు ఎవరైనా ఎస్సీ కాలనీ వాసులు వాటర్ ట్యాంకును నింపేటప్పుడు తమ గోడల పైన నీళ్లు పడ్డట్లయితే రాత్రికి రాత్రే ట్యాంక్ ను కూల్చి వేస్తామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమకు ఉన్న ఈ మినీ వాటర్ ట్యాంక్ ద్వారానే ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు మినీ వాటర్ ట్యాంక్ సహాయంతో ఇండ్లు నిర్మించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ ఏరియాలోని ఎస్సీ కాలనీకి చెందిన కొందరిని మీరు మాల మాదిగలు ఈ వాటర్ ట్యాంకును తాకరాదు,మా ఇండ్ల ముందర నుండి రాకపోకలు చేయొద్దని మహిళల పట్ల వారి కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.దీంతో ఎస్సీల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై సందీప్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.ఇప్పటికైనా తమకు ఉన్న వాటర్ ట్యాంక్ కబ్జాకు గురికాకుండా చూసి న్యాయం చేయాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ,ఎస్సీ కాలనీవాసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.