ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే యత్నం : కవిత
వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైన హామీల అమలు ఊసేలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శాసనమండలి ఆవరణలో కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మంగళవారం నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ, ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని కవిత ప్రశ్నించారు. తులం బంగారు ఇవ్వబోమని మండలి సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. [video width="480" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/03/kavitha-scooty-video.mp4"][/video]