ఆర్ఎంపి, పిఎంపిలపై దాడులు ఆపాలి
డిఎంహెచ్ఓకు పిఎంపి అసోసియేషన్ వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో జరగుతున్న ఆర్ఎంపి, పిఎంపిలపై దాడులను ఆపాలని బుధవారం పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో సుమారు 2,300 పై చిలుకు ప్రథమ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారు పల్లెల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నారని అన్నారు. కానీ ఇటీవల టీఎంసీఎస్ దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రథమ చికిత్స చేయనివారు వారి పరిధికి మించి వైద్యం అందించిన వారిపై...