Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 6:43 pm Posted by : ramakrishna

ఆర్ఎంపి, పిఎంపిలపై దాడులు ఆపాలి

డిఎంహెచ్ఓకు పిఎంపి అసోసియేషన్ వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో జరగుతున్న ఆర్ఎంపి, పిఎంపిలపై దాడులను ఆపాలని బుధవారం పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో సుమారు 2,300 పై చిలుకు ప్రథమ చికిత్స అందిస్తున్నారని తెలిపారు.  వారు పల్లెల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నారని అన్నారు.  కానీ ఇటీవల టీఎంసీఎస్ దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రథమ చికిత్స చేయనివారు వారి పరిధికి మించి వైద్యం అందించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న తాము సహకరిస్తామని తెలిపారు. ఏమైనా తమ ద్వారా తప్పులు ఉంటే సరి చేసుకుంటామని అన్నారు. గతంలో తాము పల్స్ పోలియో, హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టిబి ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నామని తెలిపారు. డాట్స్ ప్రొవైడర్ ట్రైనింగ్ కూడా ఇప్పించామని తెలిపారు. ఇటీవల ఈ టీఎంసీఎస్ వాళ్ళు వచ్చి ఆర్ఎంపీపీ, ఎంపీలకు భయభ్రాంతులను గురి చేసి ప్రథమ చికిత్స చేయొద్దని  చెప్పి కంప్లైంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సహకరిస్తామని తెలిపారు. పరిధి దాటి చికిత్స చేసిన వారిపై అధికారుల దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షుడు పులగం మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వర్మ, కోశాధికారి పోషద్రి, ఆర్గనైజ్ కార్యదర్శి జితేందర్ కూనే, రాములు, సత్యనారాయణ, హనుమండ్లు, అయూబ్, ఆస్వాక్ అలి పాల్గొన్నారు.