మాదిగలపై దాడులు చేస్తే సహించం
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో మాదిగ కులానికి చెందిన తన బంధువు కు చెందిన భూమిలో నుండి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేసుకొని, వ్యవసాయ బావిలో రాళ్ళతో మూసేసి, అదే గ్రామానికి చెందిన ఆవుల్దాపురం సాయి రెడ్డి అనే వ్యక్తి దాడి చేయడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు సుధాకర్ ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తమ బంధువులపై జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు....