Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 5:09 pm Posted by : ramakrishna

పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని మారణాయుధాలతో దాడి

 

. . . నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

. . . పరారీలో మరికోంతమంది

. . . కార్ తో పాటు మరాణాయుదాల స్వాధినం

 బోధన్, బతుకమ్మ :

పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని పలువురిపై పథకం ప్రకారం మారణాయుధాలతో దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు బోధన్ ఎసిపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం బోధన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసీపీ మాట్లాడుతూ…. రెంజల్ మండలం వీరన్న గుట్ట కు చెందిన రిజ్వానా బేగం సర్పంచ్ గా పోటీ చేసింది. అదే గ్రామానికి చెందిన జమీలుద్ధిన్, అప్సర్, హైమద్ లు ఈ నెల 11న జరిగిన పంచాయతీ ఎన్నికలలో రిజ్వాన బేగంకు సహకరించలేదని ఆమె తనయులు ఇబ్రహీం, అబు బాకర్ లతో పాటు వారి అనుచరులు  సిరాజ్, వాజీద్, ఇలియాస్, అవేజ్, ఆరిప్, మోయిస్ ఖాన్ లు కక్ష గట్టారు.  ఈనెల 12న వీరన్న గుట్ట వద్ద మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చి జమీలుద్ధిన్, అప్సర్, హైమద్ లపై పథకం ప్రకారంలో కారులో తెచ్చిన కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేశారు. బాధితులు ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం  ఇబ్రహీం, అబుబకర్, వాజీద్, అవేజ్ లను అరెస్టు చేసి వారి నుంచి కారు, నాలుగు సెల్ పోన్ లు, 2 కత్తులు, ఐరన్ రాడ్, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరికోందమందిని త్వరలో పట్టుకుంటామని ఎసీపీ తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, సిబ్బంది ఉన్నారు.

Attacked with deadly weapons for not cooperating in the Panchayat elections