Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 3:53 pm Posted by : ramakrishna

అప్పిచ్చిన డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి

. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఘటన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అప్పుగా ఇచ్చిన రూ.5వేలు తిరిగి ఇవ్వాలని కోరిన వ్యక్తిపై అప్పుతీసుకున్న వ్యక్తి కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలోని దుబ్బలో సోమవారం ఉదయం కలకలం రేపింది. దుబ్బ ఏరియాకు చెందిన విశ్వనాథ్ వద్ద భాస్కర్ అనే వ్యక్తి రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని భాస్కర్ ను విశ్వనాథ్ అడగగా, అతడిపై కక్షపెంచుకున్న భాస్కర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. బాధితుడు విశ్వనాథ్ ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడో టౌన్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 


Attacked with a knife for asking for lent money