సర్పంచ్ అభ్యర్థి పై దాడి
కరీంనగర్, బతుకమ్మ : సర్పంచ్ అభ్యర్థి పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థి కొమురయ్య పరామర్శించి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారంపొడి చల్లి దాడి చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.