Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 3:08 pm Posted by : ramakrishna

పురోహితుడిపై దాడి

నిజాంసాగర్, బతుకమ్మ: బస్సుకోసం వేచి చూస్తున్న ఓ పురోహితుడిపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. ఈ ఘటన నిజాంసాగర్ లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డికి చెందిన పురోహితుడు బద్రీనాథ్(21) హైదరాబాద్ లో ఉంటున్నాడు. దసరా కోసం ఇటీవల ఎల్లారెడ్డికి వచ్చాడు. పని నిమిత్తం బీదర్ కు వెళ్లిన బద్రీనాథ్ శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణంలో నిజాంసాగర్ లో బస్సుకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో వర్గానికి చెందిన ఏడుగురు యువకులు బద్రీనాథ్ తో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి వాసులు పలువురు శనివారం ఉదయం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.  బాధితుడికి స్థానిక పీహెచ్ సీలో చికిత్స చేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Attack on priest