Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:30 pm Posted by : ramakrishna

పేకాట స్థావరంపై దాడి..  ముగ్గురి అరెస్ట్

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాజాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ  మచేందర్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  పోలీసు బృందం దాడి చేసింది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.15,040/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.