పేకాట స్థావరంపై దాడి..పలువురి అరెస్ట్

నిజామాబాద్, బతుకమ్మ : నాలుగో టౌన్ పరిధిలోని బోర్గాం శివారులో, సాయి నగర్, గాయత్రినగర్ కాలనీల్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 48,430, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.