Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 3:08 pm Posted by : ramakrishna

పేకాటస్థావరంపై దాడి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నగరంలోని దారుగల్లీలో పేకాటస్థావరంపై రెండో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై యాసిర్ అరాఫత్ ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేశారు. ఆరుగురు పేకాటరాయుళ్లు ఇబ్రహీం, జావీద్, మోసిన్, జీయొద్దీన్, అమీరొద్దీన్, షబ్బీర్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.17,838 నగదు, ఐదు సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా పేకాట స్థావరాలు కొనసాగితే తమకు సమాచారం అందించాలని ఎస్సై అరాఫత్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.